భూ వివాదం.. అన్నను కొట్టి చంపిన తమ్ముడు

TG: మద్యం మత్తులో అన్నపై తమ్ముడు దాడి చేసి చంపాడు. ఈ ఘటన మెదక్(D) కొల్చారం(M) అంసానిపల్లిలో జరిగింది. వసురామ్ తండాకు చెందిన రమావత్ మంత్య (48), మోహన్ అన్నదమ్ములు కాగా వీరికి భూముల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అంసానిపల్లి కల్లు దుకాణంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మత్తులో ఉన్న మోహన్.. కల్లు సీసా పగులగొట్టి మంత్యను పొడిచాడు. బండరాయితో మర్మాంగాలపై దాడి చేసి మెడకు టవల్ చుట్టి బిగించాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్