జమ్ముకశ్మీర్‌లో ల్యాండ్‌మైన్ పేలుడు.. ఇద్దరు సైనికులకు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మేంథర్ సెక్టార్‌లోని కంగా గలీ వద్ద ల్యాండ్‌మైన్‌ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణ చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. వర్షాల వల్ల ల్యాండ్‌మైన్లు స్థానాలు మారడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. పూంచ్, సోపోర్‌లలో మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్