హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పండో ఆనకట్ట దగ్గర కొండ చరియలు విరిగిపడటంతో చండీగఢ్, మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చరియలు విరిగిపడుతున్న సమయంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.