శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాలకు బంగారం తాపడం చేసినప్పుడు జరిగిన బంగారం చోరీ కేసులో, అనుమానితులు అనుకున్నదానికంటే ఎక్కువ బంగారాన్ని దొంగిలించినట్లు సిట్ తాజాగా నివేదిక విడుదల చేసింది. కొల్లాం విజిలెన్స్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, స్పాన్సర్ ఉన్నికృష్ణ పొట్టి, స్మార్ట్స్ క్రియేషన్స్ సీఈవో పంకజ్ భండారి, నగల వ్యాపారి గోవర్ధన్ రొద్దంలను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ కోరింది. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పది మందిని సిట్ అరెస్టు చేసింది.