పలువురు కల్తీ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక యూపీలోని ఆగ్రాలో బుధవారం అధికారుల సోదాల్లో భారీగా కల్తీ నూనె పట్టుబడింది. ట్రాన్స్ యమునా మోహన్ నగర్‌లోని ఆగ్రో ఇండస్ట్రీస్‌లో లైసెన్స్ లేకుండా వంట నూనె ఉత్పత్తి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. నకిలీ కల్తీ నూనె, శుద్ధి చేసిన, సోయాబీన్ నూనె పట్టుబడింది.