రామారెడ్డిలో పెద్దపులి సంచారం

TG: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఓ రైతుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి, గాయపర్చింది. గ్రామస్తుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పులి పాదముద్రలను పరిశీలించారు. దాన్ని ఎస్-12 పెద్దపులిగా గుర్తించారు. రైతులు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్