అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 14న ఉదయం 6:15 గంటలకు అతిపెద్ద ఆన్‌లైన్ యోగా సెషన్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొని, గిన్నిస్ రికార్డ్ సృష్టించే ప్రయత్నంలో భాగం కావాలని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం https://moa.habit.yoga లింక్‌ను అందుబాటులో ఉంచారు.