బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ‘న్యూ గ్లెన్’ రాకెట్‌ను పరీక్షిస్తున్న సమయంలో అది లాంచ్ ప్యాడ్‌పైనే ఒక్కసారిగా పేలిపోయింది. అమెజాన్‌కు చెందిన ‘కైపర్’ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ కోసం ఈ రాకెట్ త్వరలో 48 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లాల్సి ఉంది. కాగా, ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సంస్థ వెల్లడించింది.