యూపీలోని కాన్పూర్‌లో 22 ఏళ్ల లా విద్యార్థి అభిజీత్ సింగ్ చందేల్‌పై నలుగురు వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మందులు కొనుగోలు సమయంలో మెడికల్ షాపు అటెండెంట్ అమర్ సింగ్‌తో జరిగిన చిన్న గొడవ కాస్త పెద్ద ఘర్షణగా మారింది. అమర్ సింగ్, అతని సోదరుడు విజయ్, మరో ఇద్దరు కలిసి పదునైన ఆయుధాలతో విద్యార్థి కడుపు కోసి, వేళ్లు నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో అభిజీత్ కుప్పకూలగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.