TG: అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ నేత ఆలం ఖాన్‌తో పాటు అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొయిజుద్దీన్‌ను హత్య చేయించేందుకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. గత రెండేళ్లుగా నిందితులు హత్యకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, పదిసార్లు హత్యాయత్నం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.