బీహార్‌లో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం పట్టపగలు సుల్తాన్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. జితేందర్ కుమార్ అనే న్యాయవాదిపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయా భ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.