ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కూడా ఉద్యోగాల్లో కోత విధించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సేల్స్ విభాగంలో ఈ తొలగింపులు జరుగుతున్నాయి. స్వల్ప సంఖ్యలో ఉద్యోగులపై ప్రభావం ఉంటుందని, ఇతర విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని యాపిల్ వర్గాలు తెలిపాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.