ఉబర్‌లో లేఆఫ్‌లు.. 3300 మందిపై వేటు

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 3,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. మేనేజ్‌మెంట్‌లో లేయర్లు తగ్గించడం, రైడ్ షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ వ్యాపారాలపై పెట్టుబడులను సమీక్షించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా తెలిపారు. తాజా నిర్ణయంతో ఉబర్‌లో ఉద్యోగుల సంఖ్య 30 వేలకు పరిమితం కానుంది.

సంబంధిత పోస్ట్