పార్టీలో కొత్తవారికే ప్రాధాన్యత దక్కుతోంది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన పాత నాయకులు కనుమరుగవుతున్నారని,  కొత్తవారికి ప్రాధాన్యత దక్కుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆడంబరాలు ఎక్కువయ్యాయని, సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదని విమర్శించారు. యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి నియామకాల్లో తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అందుకే నల్లగొండ సభకు హాజరు కాలేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్