LPG ట్యాంకర్ పేలుడు.. ఐదుగురు మృతి (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి టోల్‌ప్లాజా సమీపంలో ఎల్‌పీజీ ట్యాంకర్‌లో గ్యాస్ లీక్ కావడంతో క్షణాల్లోనే భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ ఒక్కసారిగా అగ్నిగోళంగా మారగా, దట్టమైన పొగతో పాటు ఎగిసిపడిన మంటలు పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మంటలను గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది, సమీపంలో ఉన్న వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్