రాజకీయాల్లో చిల్లర వైఖరిని పక్కన పెట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఓటమిపై తమ పార్టీలోనే కొందరు సంబరపడుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అస్సాం, బెంగాల్‌లో ప్రజా తీర్పును బీజేపీ దొంగలించిందని ఆరోపించారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, మొత్తం భారత్‌కు చెందినది అన్నారు. ఈ అంశాన్ని అందరూ సీరియస్‌గా తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.