TVK విజయ్‌కి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు నిరాకరించాయి. కుటమిలోనే ఉంటామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ అందుకోలేదు. కాంగ్రెస్ మద్దతు ప్రకటించినా, టీవీకే బలం 112కి మాత్రమే చేరింది.