భారతీయ ఫోటో జర్నలిజం దిగ్గజం రఘు రాయ్ (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కళా, జర్నలిజం రంగాలు తీవ్ర లోటుగా మిగిలింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి చారిత్రాత్మక ఘటనలను తన కెమెరాతో ప్రపంచానికి చూపించిన రఘు రాయ్, మదర్ థెరిస్సా, ఇందిరా గాంధీ, సత్యజిత్ రే వంటి ప్రముఖులను అద్భుతంగా చిత్రీకరించారు. ‘స్టేట్స్‌మన్’, ‘ఇండియా టుడే’లో పనిచేసిన ఆయన మాగ్నమ్ ఫోటోస్‌కు ఎంపికైన అరుదైన భారతీయుల్లో ఒకరు. ఆయనకు పద్మశ్రీతో పాటు అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.