భారతదేశానికి ఎన్నో అంతర్జాతీయ పతకాలను అందించిన లెజెండరీ షూటర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా జీవిత కథ త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ఫిల్మ్స్ ఈ బయోపిక్‌ను ప్రకటించింది. షూటర్‌గా ఆయన రికార్డులు, ఒలింపిక్ పతక విజేత మను భాకర్ వంటి ఛాంపియన్లను తీర్చిదిద్దిన తీరును ఈ చిత్రంలో చూపించనున్నారు. స్క్రిప్ట్ పనులలో జస్పాల్ రాణా స్వయంగా భాగస్వామి అయ్యారు.