ప్రోటీన్ల కోసం చికెన్, గుడ్లపై ఆధారపడేవారికి చిక్కుడు కాయలు అద్భుతమైన ప్రత్యామ్నాయం. వీటిలో ప్రోటీన్లతో పాటు ఫైబర్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. కండరాల పుష్టికి, రక్తహీనత నివారణకు ఇవి మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి కూడా చిక్కుడు కాయలు దోహదపడతాయి. గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ కూడా వీటి ద్వారా లభిస్తుంది. ఖరీదైన సప్లిమెంట్లు లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే చిక్కుడు కాయలు ప్రకృతి ప్రసాదించిన వరమని నిపుణులు పేర్కొంటున్నారు.