ఏపీలో పెరిగిన నిమ్మ ధరలు.. మార్కెట్‌లో బస్తా రూ.16 వేలు

AP: రాష్ట్రంలో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్‌లో వారం రోజుల్లోనే 80 కేజీల నిమ్మ బస్తా ధర రూ.12,000 నుంచి రూ.16,000కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.200 వరకు పలుకుతోంది. వర్షాలు సరిగా కురవకపోవడం, ప్రతికూల వాతావరణం వల్ల నిమ్మ తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. శ్రావణ మాసంలో పూజలు, శుభకార్యాల వల్ల డిమాండ్ పెరిగి, సరఫరా తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్