తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత పులి సంచారం భక్తుల్లో కలకలం రేపింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో 2765వ మెట్టు వద్ద చెట్టుపై చిరుతను చూసి భక్తులు భయపడ్డారు. అప్రమత్తమైన TTD, అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను గుంపులుగా పంపిస్తూ, పిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.