వరంగల్ జిల్లా ఖానాపురంలో చిరుతపులి సంచారం

TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఖానాపురం, కొత్తూరు గ్రామాల మధ్య ఉన్న పామాయిల్ తోటలో చిరుత పాదముద్రలను గుర్తించారు. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా చిరుత తిరుగుతున్నట్లు కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులు సంచారాన్ని నిర్ధారించారు. ఈ మేరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్