AP: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో ఓ చిరుత సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ సమీపంలో I-Block, G-Block బ్లాకుల మధ్య చిరుత కనిపించడంతో విద్యార్థులు, సిబ్బందిలో భయాందోళన నెలకొంది. ఈ విషయంపై యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.