TG: నిజామాబాద్ జిల్లా అలూర్ మండలం కల్లెడ శివారులో రాత్రి వేళ ఐదు చిరుత పిల్లలు తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాలకు సమీపంలో వీటి సంచారం ఉండటంతో రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.