AP: గుడివాడ ఘటనలో వైసీపీ కుట్ర బయటపడింది. మాజీ మంత్రి పేర్ని నాని ఫోన్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, పైనుంచి లోకేశ్ డైరెక్షన్లో బీసీ మహిళపై దాడి చేయించాడనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే బాగుంటుందంటూ ఫోన్‌లో ఉచిత సలహాలు ఇచ్చారు. తన కుటిల రాజకీయాన్ని బయట పెట్టారు. కాగా, గుడివాడలో శనివారం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.