"తెలంగాణ ఒకప్పుడు ఆర్థికంగా బాగున్నా.. ఇప్పుడు మాత్రం కుదేలైంది.. ఇందుకు కారణం గత ప్రభుత్వ పాలనలో చిత్తశుద్ధి లేకపోవడం" అని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణను అప్పుల్లో కూరుకుపోవడానికి గల కారణాలను BRS నేతలు వెల్లడించాలన్నారు. అసెంబ్లీలో చర్చ పెడదాం.. అబద్ధాలు చెప్పకుండా BRS నేతలు వాస్తవాలు మాట్లాడాలని సవాల్ విసిరారు.