TG: ములుగును అడవి జిల్లాగా తీర్చిదిద్దుదామని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. ఇంచర్ల గ్రామంలోని ఏకో పార్కులో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. ‘25వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయం. ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ములుగును అడవి జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అడవులను రక్షిస్తూనే పచ్చదనాన్ని కాపాడుకోవాలి’ అని సూచించారు.