బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు అనంతరం షేక్ హసీనా ఆ దేశాన్ని వీడి భారత్‌లోనే ఉంటున్నారు. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనాను విచారించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.