రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయానికి లేఖలు పంపారు. గాంధీ విగ్రహాల నిర్మాణం కంటే విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని హాల్ టికెట్లు ఇస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్లకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలను ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.