దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్‌ను కీలక కేంద్రంగా ఎంచుకుంది. 2030 నాటికి భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కావడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వినియోగం పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది.