సముద్రంలో మునిగిన లైబీరియా కంటైనర్ నౌక

లైబీరియా జెండా కలిగిన కంటైనర్ నౌక కొచ్చి నుంచి 38 మైళ్ళ దూరంలో మునిగిపోయింది. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ను నౌక యాజమాన్యం అత్యవసర సహాయం కోరింది. సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ICG) సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. షిప్‌లోని 24 మంది సిబ్బందిలో 21 మందిని రక్షించారు. సముద్రంలో చాలా కంటైనర్లు పడిపోయాయి. వాటిలో మెరైన్ గ్యాసోలిన్, సల్ఫర్ ఇంధన నూనె ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొస్తే ప్రజలు వాటికి దూరంగా ఉండాలని ICG సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్