ఎల్‌ఐసీ లాభం 17% వృద్ధి.. రూ.12,958 కోట్లు నమోదు

ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) 2025 డిసెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.12,958 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధి. ప్రీమియంల ద్వారా ఆదాయం రూ.1,25,613 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,33,984 కోట్లకు చేరింది. ఏజెంట్లకు కమీషన్ల కింద రూ.6011 కోట్లు చెల్లించింది. తొలి ప్రీమియం వసూళ్లు రూ.10,605 కోట్లుగా నమోదయ్యాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 0.56% లాభంతో రూ.840 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్