LIC స్కీమ్.. రోజుకు రూ.45 కడితే ఒకేసారి రూ.25 లక్షలు

పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కోసం ఎల్ఐసీ 'న్యూ జీవన్ ఆనంద్- ప్లాన్-915' పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రోజుకు రూ.45 పొదుపు చేస్తే, 35 ఏళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల హామీతో పాలసీ తీసుకున్న వ్యక్తికి మెచ్యూరిటీ తర్వాత బోనస్‌తో కలిపి రూ.25 లక్షల వరకు లభిస్తుంది. ఇది పెట్టుబడికి దాదాపు 5 రెట్లు రాబడి. మెచ్యూరిటీ తర్వాత కూడా రూ.5 లక్షల బీమా రక్షణ జీవితాంతం కొనసాగుతుంది. ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మినహాయింపు ఉంది. పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత రుణం పొందే అవకాశం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్