మహిళల కోసం LIC స్పెషల్ ప్లాన్.. నెలకు రూ.4,400 కడితే చేతికి రూ.16 లక్షలు

మహిళల కోసం ఎల్ఐసీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన బీమా లక్ష్మి ప్లాన్ (ప్లాన్ 881) మంచి పొదుపు, భద్రత కల్పిస్తోంది. 18 నుంచి 50 ఏళ్ల మహిళలు ఈ పాలసీకి అర్హులు. నెలకు సుమారు రూ.4,400 ప్రీమియం చెల్లిస్తే, 25 ఏళ్ల తర్వాత దాదాపు రూ.16 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఇది మనీబ్యాక్ పాలసీ కావడంతో ప్రతి 2 లేదా 4 సంవత్సరాలకు సర్వైవల్ బెనిఫిట్స్ అందుతాయి. 7–15 ఏళ్ల ప్రీమియం కాలం ఎంపిక చేసుకోవచ్చు. పన్ను మినహాయింపులు, లోన్ సౌకర్యం, అదనపు రైడర్ల లభ్యత ఈ పథకం ప్రత్యేకత.

సంబంధిత పోస్ట్