18 నెలల చిన్నారికి జీవదానం.. ఉస్మానియాలో అరుదైన సర్జరీ

ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు గ్లైకోజెన్ స్టోరేజ్ వ్యాధితో బాధపడుతున్న 18 నెలల బాలుడికి 14 గంటల పాటు శ్రమించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తండ్రి కాలేయంలోని కొంత భాగాన్ని సేకరించి చిన్నారికి అమర్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్సపై మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ ఆస్పత్రిలో ఇలాంటి చికిత్స జరగడం విశేషం. బాలుడు ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.

సంబంధిత పోస్ట్