మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మెడికల్ కాలేజీలో జ్యోతి అహిరే అనే మహిళా ఉద్యోగి తన విధుల్లో భాగంగా వస్తువులను తరలించే ఎలివేటర్‌ను ఉపయోగించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలి ఆమె తలపై పడింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు కాలేజీలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.