TG: బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది. గాలిలో తేమ తగ్గడం వల్ల చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది.