పట్నా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం కొంత దెబ్బతిని లోపలికి చొచ్చుకుపోయింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.