పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు!

పహల్గాం ఉగ్రదాడిలో వాడిన ఫోన్లకు పాకిస్థాన్‌లోని ఫైసల్ బ్యాంక్‌తో సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రవాదులు ఉపయోగించిన షావోమి ఫోన్ల కన్సైన్‌మెంట్‌కు ఫైసల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఈ బ్యాంకు పేరు ఉగ్ర కార్యకలాపాల్లో వినిపించింది. అయితే, ఈ దాడిలో బ్యాంకు ప్రమేయం నేరుగా బయటపడలేదని అధికారులు తెలిపారు. పాక్ ఉగ్రవాద సంస్థలు ఈ బ్యాంకులో డిపాజిట్లు నిర్వహిస్తున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఉగ్రవాది ఫైసల్ జాట్ వాడిన ఫోన్లను 2021, 2023ల్లో దిగుమతి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్