హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

TG: హోలీ పండుగ ఆఫర్ల పేరుతో వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే నకిలీ లింక్‌లు, ఏపీకే (APK) ఫైళ్లను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. ఈ మేరకు రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ లింక్‌లు పంపుతున్నట్లు తెలిపారు. వీటిపై క్లిక్ చేయవద్దని, పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్