జనావాసాల్లోకి వచ్చి ఆవును వేటాడిన సింహం(వీడియో)

గుజరాత్‌లోని గిర్ జాతీయ పార్క్ సమీపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక  సింహం జనావాసాల్లోకి ప్రవేశించి ఆవును వేటాడి చంపింది. అనంతరం ఆ సింహం గోడ దూకి తప్పించుకుంది. రాత్రి సమయంలో రోడ్డుపై జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సింహం ఆవును చంపి పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గి, మానవ ఆక్రమణలు పెరగడంతో వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్