జూ నుంచి తప్పించుకున్న సింహం.. ప్రజలపై దాడి (వీడియో)

జూ నుంచి తప్పించుకున్న సింహం ప్రజలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సింహాన్ని బంధించేందుకు అధికారులు విఫలయత్నాలు చేశారు. ఫలితం లేకపోవడంతో పాక్ పోలీసులు కాల్చి చంపారు. కాగా ఈ ఘటన జులై 2న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్