సోషల్ మీడియాలో ఓ సింహం వీడియో తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, కొందరు పర్యాటకులు వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సింహం లోపలికి దూకేసింది. దీంతో పర్యాటకులు భయపడతారు. అయితే కాసేపు అది అలాగే ఉంటుంది. చివర్లో ట్విస్ట్ ఏంటంటే.. వాస్తవానికి అది సింహం కాదు. “సింహం” మాస్క్ వేసుకొని ఉన్న శునకం. ఈ వీడియోని చూసిన నెటిజన్‌లు ప్రాంక్ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.