హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు ఆల్‌టైం రికార్డు

హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చరిత్రాత్మక రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో రూ.5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీనిని ఆల్‌టైం రికార్డ్‌గా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్