గత ఏడాది TGలో రూ.40 వేల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు

తెలంగాణలో గత ఏడాది(2025-26 ఆర్థిక సంవత్సరంలో) భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయంలో సరికొత్త రికార్డును అందుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి రూ.40,209 కోట్ల మార్కు దాటినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో మద్యం అమ్మకాలతోపాటు.. బార్లు, వైన్స్‌ల టెండర్లు, మద్యం దుకాణాల ఫీజుల రూపంలో ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.5,051 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్