నామినేటెడ్ పదవుల కోసం సీఎం వద్దకు నేతల జాబితా!

TG: ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీల్లో నియామకాలకు అర్హుల గుర్తింపుపై సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించినట్లు సమాచారం. పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్న వారికి, 50 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన గుర్తించిన నేతల పేర్ల జాబితాలను సీఎంకు వీరు అందజేసినట్లు పార్టీ వర్గాల టాక్.

సంబంధిత పోస్ట్