భారతదేశంలో 1951లో 18% ఉన్న అక్షరాస్యత రేటు.. 2025 నాటికి 80.9% (7 ఏళ్లు పైబడినవారిలో)కి గణనీయంగా మెరుగుపడింది. అయితే గ్రామీణ ప్రాంతాలు (77.5%), మహిళలు (74.6%), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఇంకా సవాళ్లున్నాయి. మహిళలు, గ్రామీణులు, SC/STలలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ (6-14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య), సాక్షర్ భారత్ (వయోజనులకు అక్షరాస్యత) వంటి కార్యక్రమాల ద్వారా అక్షరాస్యతను పెంచడానికి కృషి చేస్తోంది.