TG: జగిత్యాల, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రైతు పిట్టల లింగన్న గత నెల 14న అప్పుల బాధతో పురుగుల మందు తాగి మృతిచెందాడు. ఈ క్రమంలో ఆ రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పరామర్శించింది. బ్యాంకులో తీసుకున్న రూ.2.3 లక్షల లోన్ మాఫీ కోసం రైతు భరోసా వస్తుందనుకున్నాడు. అవి ఏవీ రాకపోయేసరికి చనిపోయినాడని రోదిస్తున్న తల్లి లక్ష్మి కన్నీళ్లను చిన్నారి ఓదార్చించింది. అది చూసి అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.