మౌళి, శివానీ జంటగా నటించిన 'లిటిల్ హార్ట్స్' సినిమా అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్, చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఎంసెట్ లో ర్యాంకు రాని కుర్రాడు, లాంగ్ డిస్టెన్స్ కోర్సులో బీటెక్ లో ఫెయిల్ అయిన అమ్మాయి మధ్య ప్రేమ కథ, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.